రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా

17 Dec, 2014 20:08 IST|Sakshi

నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వు బ్యాంకు రెండు బ్యాంకులకు లక్షల్లో జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ. 50 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 25 లక్షల వంతున జరిమానా విధించింది.

గతంలో కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. అయినా.. కొన్ని బ్యాంకులు దాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ రెండు బ్యాంకులకు జరిమానాలు వడ్డించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా