ఐటీ చరిత్రలో సంచలన కలయిక

19 Jun, 2020 20:19 IST|Sakshi

ముంబై: ఐటీ చరిత్రలో సంచలన కలయికకు దిగ్గజ కంపెనీలు వేదికయ్యాయి. తొలిసారిగా ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఐబీఎం కలిసి పనిచేయనున్నాయి. తమ క్లయింట్‌లకు మెరుగైన సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్‌లకు అత్యాధునిక టెక్నాలజీని అందించేందుకు ఐబీఎమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీసీఎస్‌ తెలిపింది.  అత్యుత్తమ సాంకేతికతతో ఐబీఎమ్‌ క్లౌడ్‌ యూనిట్‌ను  టీసీఎస్‌ ప్రారంభించనుంది. ఇందులో రెండు కంపెనీలు(టీసీఎస్‌, ఐబీఎమ్‌)లకు చెందిన అత్యుత్త సాంకేతిక నిపుణులు సేవలందిస్తారు.

అయితే డేటా ఎస్టేట్‌ , వివిధ రకాల అప్లికేషన్స్‌ తదితర అంశాలను బదిలీ చేయనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఇరు కంపెనీలు వృద్ధి చెందేందుకు మెరుగైన అంశాలు బదిలీ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇదివరకు డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా భవిష్యత్తులో డిజిటల్‌ రంగం సృష్టించబోయే నూతన అప్లికేషన్స్‌ ఆధునీకరణ, క్లౌడ్ కంప్యూటింగ్‌ తదితర అంశాలలో ముందుంటామని టీసీఎస్‌ ఉన్నతాధికారి వెంకట్రామన్ తెలిపారు.

వెంకట్రామన్ స్పందస్తూ.. భవిష్యత్తులో క్లయింట్లు, వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు టీసీఎస్‌, ఐబీఎం ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాగా  క్లౌడ్‌ టెక్నాలజీ బదిలీ వల్ల క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవకాశముంటుందని ఐబీఎం‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బోబ్‌ లార్డ్‌ పేర్కొన్నారు. టీసీఎస్,‌ ఐబీఎమ్‌ ఒప్పందంతో ఐటీ వేగంగా వృద్ధి చెందుతుందని లార్డ్‌ అభిప్రాయపడ్డారు. క్లయింట్లకు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు టీసీఎస్‌, ఐబీఎమ్‌ కలయిక ఉపయోగపడుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. (చదవండి: నిరుద్యోగుల కోసం టీసీఎస్‌ శిక్షణ)‌

మరిన్ని వార్తలు