వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు!

12 Dec, 2017 12:34 IST|Sakshi

న్యూఢిల్లీ : మెసేజింగ్‌ సర్వీసుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌, మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటలోకి తేవడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల ఐఫోన్లలో యూట్యూబ్‌ వీడియోలను సంభాషణ మధ్యలో ఉండగానే ప్రత్యక్షంగా చూసేలా, రెండోది లాక్‌ రికార్డింగ్ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా గ్రూపు మెసేజ్‌లలో వ్యక్తిగత సందేశాలలు పంపే వీలు కల్పించనుంది. ప్రస్తుతం సరికొత్త ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.

గ్రూపులో ప్రైవేట్ చాటింగ్
వాట్సాప్‌లో గ్రూప్ చాటింగ్ చేస్తుండగా.. ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు గ్రూపులోకి ఒక్క యూజర్‌కు వ్యక్తిగతంగా సందేశం పంపడానికి కొచ్చ ఫీచర్ త్వరలో అందిస్తామని సంస్థ ప్రకటించింది. రిప్లై ప్రైవేట్‌లీ (Reply Privately) అనే ఆప్షన్ ద్వారా గ్రూపు నుంచి మనకు కావలసిన వ్యక్తికి సందేశాలు పంపాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

వాట్సాప్ వెబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్
వాట్సాప్ బీటాఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ వెబ్‌లో పిక్చ్ ఇన్ పిక్చర్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వీడియో చూస్తునే వాయిస్ కంట్రోల్ చేయడం, ప్లే/పాస్ బటన్, టైమ్‌లైన్ స్లైడర్ వాడవచ్చు. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో కంటెట్ చూస్తున్నప్పుడు.. అదే స్క్రీన్ మీద అందే విండోలో యూజర్లతో ఎంచక్కా చాటింగ్ చేసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు