భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు

3 Aug, 2019 10:50 IST|Sakshi

జూలైలో రెండంకెల క్షీణత

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు జూలై నెలలో గణనీయంగా పడిపోయాయి.  హీరో మోటోకార్ప్‌.. విక్రయాలు ఏకంగా 21.18% దిగజారి 5,35,810 యూనిట్లకు పరిమితమమ్యాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 27% తగ్గిపోయాయి. ఈ సంస్థ దేశీ విక్రయాలు 49,182 యూనిట్లు కాగా, బజాజ్‌ ఆటో అమ్మకాల్లో 13%, టీవీఎస్‌ మోటార్‌ విక్రయాల్లో 16% తగ్గుదల నమోదైంది. మరోవైపు    టాటా మోటార్స్‌ అమ్మకాలు  34 శాతం తగ్గుదలతో 32,938 యూనిట్లుగా నయోదయ్యాయి. ఇక పూణేలో ఈ సంస్థ ఏడు చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేసింది. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 300 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లలో వీటిని ప్రారంభించనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది.

రూ.1.58 లక్షలు తగ్గిన ‘కోనా’ ధర
హ్యుందాయ్‌ తాజాగా విడుదలచేసిన తన తొలి ఎలక్ట్రిక్‌ కారు ‘కోనా’ ధరను రూ.1.58 లక్షలు తగ్గించింది. దీంతో ఈ కారు ధర రూ.23.71 లక్షలకు తగ్గింది. జీఎస్‌టీ తగ్గిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీచేయడంలో భాగంగా ఈ మేరకు ధర తగ్గినట్లు కంపెనీ వివరించింది. మహీంద్రా కూడా ఈ–వెరిటో ధరను రూ.80 వేల వరకూ తగ్గించింది.

మరిన్ని వార్తలు