ఇక భిమ్‌ ద్వారా ఉబెర్‌ చెల్లింపులు

23 Aug, 2017 20:46 IST|Sakshi



సాక్షి,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిట‌ల్  ఇండియాకు మద్దతుగా  మరో క్యాబ్‌ అగ్రిగేటర్‌ చేరిపోయింది. తాజాగా అంత‌ర్జాతీయ క్యాబ్ స‌ర్వీస్ సంస్థ ఊబెర్  డిజిటల్‌  చెల్లింపుల‌ను ప్రోత్స‌హించ‌డానికి , భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ ( భిమ్‌ ) ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. భార‌త వినియోగ‌దారుల‌కు భిమ్‌, యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ), యాప్‌ల ద్వారా ఈ చెల్లింపు సౌక‌ర్యాన్ని  అందిస్తోంది ఈ వారాంతం నుంచి ఈ పేమెంట్ స‌దుపాయం అందుబాటులోకి రానుంది.  మరో క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ  ఓలా ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో చేరింది.   

యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ సహాయంతో యుపిఐ అనుసంధానం జరిగిందనీ,  అయితే రైడర్లు ఈ ఫ్లాట్‌ఫాంలో ఉన్న ఇతర   52 బ్యాంకుల్లో దేనితోనైనా సైన్ ఇన్ కావచ‍్చని ఉబెర్‌ తెలిపింది. ఈ   ఫీచర్ ప్రస్తుతం  ఆండ్రాయిఢ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే నెలల్లో మిగతా ఐఓఎస్‌లను అందించనున్నట్టు చెప్పింది.

నగదురహిత సమాజాన్ని సృష్టించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఉబెర్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రిచర్‌ వెల్లడించారు. ఉబెర్‌ లాంటి గ్లోబల్‌ బ్రాండ్ల ద్వారా భిమ్‌, యూపీఊ  సేవల ఉపయోగంలో  ప్రజల సంఖ్యను పెంచే లక్ష్యాన్ని కేంద్రం ఆశిస్తోందన్నారు.

కాగా ఊబెర్‌కు దేశ‌వ్యాప్తంగా 4.5 ల‌క్ష‌ల మందికి పైగా వినియోగ‌దారులు ఉన్నారు. వీరంతా వారానికి 9.4 మిలియ‌న్ల  రైడ్లను నిర్వహిస్తోంది.. యూపీఐ, భిమ్ సౌక‌ర్యాల ద్వారా ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఊబెర్‌ ప్రధాన ప్రత్యర్థి ఓలా క్యాబ్ త‌మ యాప్‌లో యూపీఐ స‌దుపాయాన్ని ఆరునెలల క్రిత‌మే ప్రవేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.
 

 

>
మరిన్ని వార్తలు