ఓలాకు షాక్‌: ఉబెర్‌కు భారీ పెట్టుబడులు

14 Nov, 2017 09:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భారీ   పెట్టుబడులను ట్యాక్సీ సేవల సంస్థ  ఉబెర్‌ ఎట్టకేలకు  సాధించింది.  జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌  ట్యాక్సీ సేవల సంస్థ  ఉబెర్‌లో  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.  ఈ మేరకు ఉబెర్‌తో సాఫ్ట్‌ బ్యాంక్‌ ఒక​ ఒప్పందం కుదుర్చుకుంది.  ఒక బిలియన్‌డాలర్ల విలువ చేసే ఉబెర్‌వాటాను సాఫ్ట్‌ బ్యాంకు కొనుగోలు  చేయనుందని ఉబెర్‌  దృవీకరించింది.  అనంతరం దాదాపు 14శాతం వాటాను సాఫ్ట్‌ బ్యాంక్‌  కొనుగలు చేయనుంది.

ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఈ డీల్‌ వెలుగులోకి వచ్చినప్పటికీ  కార్పొరేట్‌ గవర్ననెన్స్‌, కొన్ని న్యాయపరమైనచిక్కుల కారణంగా ఇంతకాలం వాయిదాపడింది. సోప్ట్‌ బ్యాంక్‌  డ్రాగోనియెర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంతో ఒక ఒప్పందం కుదిరిందని ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది.  దీంతో విదేశాలలోతమ సేవల విస్తరణకు దోహదపడుతుందనీ కార్పొరేట్ పాలనను బలపరుస్తుందని  పేర్కొంది.

కాగా జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌కు భారత్‌లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా క్యాబ్‌ ఆగ్రిగేటర్‌ ఓలా, ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌  పెట్టుబడుల ద్వారా భారీ నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు  ప్రత్యర్థి కంపెనీ ఓలా కూడా తీవ్రమైన పోటీ ఎదుర్క అమెరికాకు చెందిన  ఉబెర్‌ భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోసాప్ట్‌బ్యాంకు భారీపెట్టుబడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఉబెర్‌, సాఫ్ట్‌బ్యాంక్‌, పెట్టుబడులు,
 

మరిన్ని వార్తలు