కస‍్టమర్లే టార్గెట్‌ : ఉబెర్‌ కొత్త వ్యూహం

13 Jun, 2018 12:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన​ క్యాబ్‌ అగ్రిగేటర్‌  ఉబెర్‌ ఇండియా సరికొత్త ప్రణాళికలతో దూసుకు వస్తోంది. భారత్‌లో  ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులే లక్ష్యంగా  వ్యూహ రచన చేసింది.  డారా ఖోస్రోషహీ నాయకత్వంలో ఉబెర్‌ ఇండియా ఇక్కడి మార్కెట్‌ను మరింత  పెంచుకునేందుకు  కృషి చేస్తోంది.  నెట్‌వర్క్‌  లో కనెక్టివిటీ పరిస్థితుల్లోనూ,  అలాగే తక్కువ  స్టోరేజ్‌ ఉన్న ఫోన్లలో కూడా బాగా పని చేయడానికి వీలుగా ఉబెర్‌ యాప్‌లో  'లైట్' వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.  అంతేకాదు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ ఉబెర్‌లైట్‌ వెర్షన్‌ను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. త్వరలోనే భారతీయ భాషలు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ , గుజరాతీ భాషల్లో విడుదల చేయనుంది.  తద్వారా  భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని  ప్రధాన ప్రత్యర్థి ఓలాను  ఢీకొట్టేందుకు సిద్దపడుతోంది.

టైర్ -3 నగరాలలో దాని వినియోగదారుల సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి, ప్రజాదరణను పెంచుకోటానికి ఉబెర్ తన యాప్‌లో డేటా-లైట్ సంస్కరణను ప్రవేశపెట్టింది.  స్థానిక  కస్టమర్లకు ఆకట్టుకునేలా వారికి అందబాటుల్లో భాషల్లో యాప్‌ను లాంచ్‌ చేయనుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా  ఈ యాప్‌ను లాంచ్‌ చేసింది.  ఉబెర్ లైట్ రానున్న నెలల్లో దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ఉబెర్‌ ప్రకటించింది.  ఏడు భారతీయ భాషలలో దీన్ని  ప్రారంభించనున్నామని తెలిపింది.  యూజర్లకు రైడ్-బుకింగ్ అనుభవాన్ని సాధ్యమైనంత మృదువుగా, సన్నిహితంగా  వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం యూజర్లతో మాట్లాడుతున్నామని ఉబెర్ రైడర్ ప్రొడక్షన్ హెడ్ పీటర్ డెంగ్ చెప్పారు.

మరిన్ని వార్తలు