ఉబెర్ యూజర్ల ఫోన్ నంబర్లు భద్రం

25 Sep, 2015 00:12 IST|Sakshi
ఉబెర్ యూజర్ల ఫోన్ నంబర్లు భద్రం

న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్.. తమ కస్టమర్ల ఫోన్ నంబర్లకు భద్రత కల్పించే కొత్త ఫీచర్‌ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఫోన్ కాల్ చేసే కస్టమర్ల వ్యక్తిగత ఫోన్ నంబర్లు.. ట్యాక్సీ డ్రైవర్లకు తెలియకుండా ఉండేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించామని, త్వరలో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అమల్లోకి తెస్తామని వివరించింది. ఉబెర్ పోటీ సంస్థ ఓలా ఇటీవలే ఈ తరహా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని వార్తలు