ఆధార్‌ "ఫేషియల్ రికగ్నిషన్" త్వరలో

24 Aug, 2018 14:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్‌ వ్యవస్థకు మరింత భద్రత కల్పించేలా యుఐడిఎఐ  మరిన్ని చర్యల్ని చేపట్టనుంది. ఆధార్ ప్రమాణీకరణలో అదనపు ఫీచర్‌గా ఫేషియల్‌ రికగ్నిషన్‌ను మాండేటరీ చేయనుంది. ఆధార్ గుర్తింపును మరింత పకడ్బందీగా చేసేందుకు ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ కూడా తప్పనిసరి  చేయనున్నట్టు యుఐడిఎఐ  తెలిపింది. 

సెప్టెంబర్ 15నుంచి ఆధార్ నెంబర్లను వారివారి ఫేషియల్ రికగ్నిషన్‌తో అనుసంధానం చేయాలని యూఐడీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేలిముద్రలు, చేతిముద్రలు, కంటిపాపలతో ఆధార్ సెక్యూరిటీ కోసం జాగ్రత్తలు తీసుకున్న అధికారులు మరిన్ని భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ ని తప్పనిసరి చేస్తున్నారు. ఈ మేరకు యూఐడీఏఐ తో పనిచేస్తున్న అన్ని ఏజెన్సీలు, సర్టిఫైడ్ బయోమెట్రిక్ డివైస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ పది శాతం లావాదేవీలను పరిశీలించి సమీక్షిస్తామని సీఈఓ అజయ్ భూషణ్ చెప్పారు.ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా సెక్షన్ 42, 43 ప్రకారం జైలుశిక్ష గానీ, జరిమానా గానీ లేదా రెండూ గానీ విధిస్తారని అజయ్ భూషణ్ చెప్పారు. కాగా ఆధార్‌ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు