మాల్యాకు యూకే కోర్టు భారీ షాక్‌

21 Nov, 2018 19:41 IST|Sakshi

విజయ్‌ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ

యూబీఎస్‌కు అప్పు ఎగ్గొట్టిన మాల్యా

బ్యాంకుకు  రూ. 80 లక్షలు చెల్లించాలి - యూకే హైకోర్టు

భారత్‌లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.9వేల వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా(62)కు యూకేకోర్టు షాక్‌ ఇచ్చింది. మాల్యా లండన్‌ హౌస్‌కు సంబంధించి యూబీఎస్‌(యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విజ్టర్లాండ్) వద్ద తీసుకున్నరుణాలపై కోర్టు కీలక తీర్పు చెప్పింది. స్విస్‌బ్యాంకు యూబీఎస్‌కు సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  ఒకవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా నిర్ధారించిన మాల్యాను తిరిగి  దేశానికి రప్పించేందకు భారత్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే లండన్‌లో పలు కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్నాడు. తాజా తీర్పు మాల్యాకి  గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.


యుబిఎస్ బ్యాంకు  తనకు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూకే హైకోర్టును ఆశ్రయించింది. మాల్యా  కుటుంబానికి చెందిన  రోజ్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ విలాసవంతమైన నివాస సముదాయం నిర్మాణం కోసం రీజెంట్స్ పార్క్ ఇంటిని యుబిఎస్ గ్రూప్ దగ్గర తనఖా పెట్టి రుణం తీసుకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మాల్యా సుమారుగా 1 బిలియన్ పౌండ్ల రుణాలకు (దాదాపు రూ.10,000 కోట్లు) సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు భారత్, యుకెలలో సివిల్ దావాలు, క్రిమినల్ మోసం ఆరోపణలు ఉన్నాయి. 

కాగా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్‌కు చెక్కేసిన కేసులో గత ఏడాది డిసెంబరు 4న లండన్‌ కోర్టులో విచారణ మొదలైన సంగతి తెలిసిందే.

 
 

మరిన్ని వార్తలు