కెనరా బ్యాంకుకు భారీ జరిమానా

6 Jun, 2018 19:32 IST|Sakshi

భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో  ఒకటైన  కెనరా బ్యాంకుకు యూకే రెగ్యులేటరీ భారీ షాక్‌ ఇచ్చింది.  యాంటీ మనీలాండరింగ్‌ నిబంధనలను పాటించని కారణంగా బ్యాంకుకు చెందిన లండన్ బ్రాంచ్‌లో యూకే  ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్(ఎఫ్‌సీఏ) 896,100 పౌండ్లు (సుమారు రూ.8 కోట్లు) జరిమానా విధించింది. అంతేకాదు దాదాపు 5 నెలలు డిపాజిట్లను స్వీకరించకుండా నిలిపివేసింది.  కొత్త ఖాతాదారుల నుండి 147 రోజులు పాటు డిపాజిట్లను  నిషేధించింది.

కెనరా బ్యాంక్ నవంబర్ 26, 2012, జనవరి 29, 2016 మధ్యకాలంలో ప్రిన్సిపల్ 3 (యాజమాన్యం అండ్‌ కంట్రోల్‌) ఉల్లంఘించిన  కారణంగా  ఈ చర్య తీసుకున్నట్టు ఎఫ్‌సీఏ  తన నోటీసులో తెలిపింది. అంతేకాదు ఎఫ్‌సీఏ విచారణను ప్రారంభ దశలోనే సెటిల్‌ చేసుకునేందుకు అంగీకరించినందున పెనాల్టీని 30 శాతం తగ్గించినట్టు తెలిపింది. లేదంటే పెనాల్టీ 1280175పౌండ్లు( సుమారు రూ.11కోట్లు) గాను, డిపాజిట్లను స్వీకరణపై నిషేధం 210 రోజులుగానూ ఉండేది. 
 

మరిన్ని వార్తలు