ఉక్రెయిన్ సంక్షోభంతో గడ్డుకాలం

6 Mar, 2014 02:14 IST|Sakshi
ఉక్రెయిన్ సంక్షోభంతో గడ్డుకాలం

న్యూఢిల్లీ: రష్యా జోక్యంతో ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభం ముదిరిన కారణంగా సీఐఎస్ దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావంపడే అవకాశముంది. రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లితే ఆయా దేశాలతో ఇండియా వాణిజ్యం 15% తగ్గవచ్చని అసోచామ్ పేర్కొంది. ఈ  ఆర్థిక సంవత్సరం(2013-14)లో భారత్, ఉక్రెయిన్‌ల మధ్య వాణిజ్యం సుమారు 200 కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చనీ, గతేడాది కంటే ఇది 36% తక్కువని తెలిపింది.

 సీఐఎస్ దేశాలకు అత్యధికంగా ఎగుమతులు చేసే ఫార్మా, విద్యుత్ యంత్రాల రంగాలపై సంక్షోభ ప్రభావం అత్యధికంగా ఉండవచ్చ ని అంచనా వేసింది. గత ఏప్రిల్ - జనవరి మద్యకాలంలో ఆయా దేశాలతో వాణిజ్యం 8% కు పైగా తగ్గిందని పేర్కొంది. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలు భారతీయ ఎగుమతిదారులకు ఏమాత్రం మంచివి కావని ఇంజనీరింగ్ ఎగుమతిదారుల సంఘం (ఈఈపీసీ) చైర్మన్ అనుపమ్ షా అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు