ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి యూనిలీవర్!

17 Aug, 2016 00:34 IST|Sakshi
ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి యూనిలీవర్!

లండన్: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తాజాగా ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. ఇందులో భాగంగా యూనిలీవర్ స్వీడన్‌కు చెందిన ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సర్వీసులను అందించే ‘బ్లూఎయిర్’ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. బ్లూఎయిర్..  స్టాక్‌హోమ్ కేంద్రంగా తన కార్యకలాపాలను 1996లో ప్రారంభించింది. దీని టర్నోవర్ గతేడాది 106 మిలియన్ డాలర్లుగా ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు