బడ్జెట్‌ 2020 : కార్యాలయానికి నిర్మలా సీతారామన్

1 Feb, 2020 09:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను మరికొన్ని గంటల్లో ఆవిష్కరించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ శనివారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరుతారు. ఉదయం 10.15గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రివర్గం బడ్జెట్‌ను లాంఛనంగా ఆమోదించనుంది. అనంతరం కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. ఈసారి బడ్జెట్‌పై ప్రజలతోపాటు కంపెనీలు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. వేతన జీవులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు