జీఎస్‌టీ : అరుణ్‌ జైట్లీ ముందు చూపు

1 Feb, 2020 11:16 IST|Sakshi

సాక్షి, న్యూడిల్లీ:  దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్‌ తీసుకొస్తున్న యూనియన్‌ బడ్జెట్‌ 2020పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 1 శనివారం నిర్మలా సీతారామన్‌ ఆర్థికమంత్రిగా రెండసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనికి ముందు ఆమె 15వ ఆర్థిక సంఘం రిపోర్టును సభ ముందు ఉంచారు. రాజకీయ స్థిరత్వంతోపాటు, ఆర్థిక పురోగతిని కాంక్షిస్తూ ప్రజలు తమకు అధికారాన్నిచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ది పథంలో నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆర్థికమంత్రి చెప్పారు.

(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్హైలైట్స్కోసం ఇక్కడ క్లిక్చేయండి)

అన్ని రంగాల్లో వృద్ది రేటు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఈ క్రమంలో తాము తీసుకొచ్చిన జీఎస్‌టీ చాలా కీలకమైందని  నిర్మలా సీతారామన్‌​ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ఊతమిచ్చేలా ,కొనుగోలు శక్తి పుంజుకునేలా బడ్జెట్‌ వుంటుందని ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. జీఎస్‌టీ చారిత్రాత్మక నిర్ణయమని,  పన్ను రేట్ల శ్లాబుల వల్ల సామాన్యుల నెలవారీ ఖర్చులు తగ్గాయి, తద్వారా వారికి భారీ ప్రయోజనం చేకూరిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రికి అరుణ్‌ జైట్లీకి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలో చాలా కీలకమైన జీఎస్‌టీ విషయంలో జైట్లీ చాలా ముందు చూపుతో వ్యవహరించారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ( యామ్ వెయిటింగ్‌‌: కిరణ్ ముజుందార్ షా)

>
మరిన్ని వార్తలు