ఐడీబీఐ, ఎల్‌ఐసీలో వాటా అమ్మకం

1 Feb, 2020 13:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది.  ఆర్థిక బడ్జెట్‌ 2020లో ఈ మేరకు ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ప్రభుత్వ పెట్టుబడుల చొరవలో భాగంగా తన వాటాలను విక్రయించనుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీప్రయివేటీకరణ క్రమంలో  వాటాను అమ్మకానికి పెట్టింది.  అటు ఐడీబీఐ వాటాల విక్రయానికి నిర్ణయం. త్వరలో ఎల్‌ఐసీ స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్ చేయనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో తన హోల్డింగ్‌లో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ప్రస్తుతం, ఎల్‌ఐసీలో ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది.  ఈ ప్రకటనతో ఐడీబీఐబ్యాంక్ షేర్లు బీఎస్‌ఈలో 17.4 శాతం పెరిగి 39.8 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ( బడ్జెట్‌ 2020: ‘ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు’)

మరిన్ని వార్తలు