మోత మోగనున్న కార్ల ధరలు

30 Aug, 2017 13:13 IST|Sakshi
మోత మోగనున్న కార్ల ధరలు

న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లగ్జరీకార్లు, ఎస్‌యూవీలపై  పన్ను భారాన్ని విధించింది.   ఈ మేరకు  బుధవారం జరిగిన   కేంద్ర   కేబినెట్‌ సమావేవంలో నిర్ణయం జరిగింది.  కొత్త జీఎస్‌టీ చట్టం కింద  15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్యూవీలపై సెస్‌  పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను,  వ్యాట్‌  లాంటి స్థానంలో జులై 1 నుంచి  కొత్త   జీఎస్‌టీ అమల్లోకి రావడంతో  చాలా   వివిధ  కార్ల ఉత్పత్తి సంస్థలు తమ ఎస్యూవీ, తదితర లగ్జరీ కార్ల ధరలను  రూ 1.1 లక్షలు, రూ .3 లక్షల మధ్య తగ్గింది. తాజా నిర్ణయంతో ఈ  ఇది రివర్స్‌ కానుంది. ప్రస్తుతం అమలవుతున్న సెస్‌ 15నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్‌ కార్ల ధరలు  మోత  మోగనున్నాయి.  మరోవైపు ఈ సెస్‌ పెంపు నేపథ్యంలో మారుతీ, టాటా మోటార్స్‌ షేర్లు 1 శాతం చొప్పున  ఎగిశాయి.

స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్‌ అమలు కానుంది. సెస్ పెంపు కారణంగా ఈ మేరకు పలు పెద్ద(విలాసవంత) కార్ల ధరలు పెరగనున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. అయితే సెప్టెంబర్‌ 9న జరగనున్న  జీఎస్‌టీ కౌన్సిల్‌  సమావేశం తరువాత దీనిపై నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం, అనంతరం పార్లమెంట్‌  అమోదం లభించాల్సి ఉంటుంది. 
 

మరిన్ని వార్తలు