కేంద్ర బడ్జెట్‌ కసరత్తు షురూ, తొలి సమావేశం

16 Dec, 2019 11:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ రూపకల్పన సన్నాహాలను మొదలుపెట్టేశారు. 2020-21 కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ కసరత్తులో భాగంగా తొలి  సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సార్ట్‌-అప్‌, ఫిన్‌టెక్‌, డిజిటల్‌ సంస్థల ప్రతినిధులతో ముందస్తు  సంప్రదింపులు నిర్వహించారు. ఈ  సంప్రదింపులు డిసెంబర్ 23 వరకు సంప్రదింపులు కొనసాగుతాయని  సమాచారం.

సోమవారం నుండి ప్రారంభమయ్యే ప్రీ బడ్జెట్  సమావేశాల్లో, వినియోగం, వృద్ధిని పునరుద్ధరించడానికి ఆర్థిక సంస్థలు పరిశ్రమ సంస్థలు, రైతు సంస్థలు ఆర్థికవేత్తలతో  ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా  డిసెంబర్ 19న  పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. వ్యాపారం సులభతరం, ప్రైవేటు పెట్టుబడులను ప్రభావితం చేసే నియంత్రణ వాతావరణం, ఎగుమతి పోటీతత్వం, రాష్ట్రాల పాత్ర (చెల్లింపులు ఆలస్యం, కాంట్రాక్ట్ అమలు), ప్రైవేట్ పెట్టుబడుల పునరుద్ధరణ వృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే వ్యక్తిగత ఆదాయపు పన్నులో కొంత ఉపశమనం లభించనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి  తెలిపారు. కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ రెండవసారి కొలువు దీరిన అనంతరం ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న రెండోసారి కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఒకవైపుభారీగా క్షీణించిన వినియోగ డిమాండ్‌, జీడీపీ 5శాతం దిగువకు లాంటివి ఆమె ముందున్న సవాళ్లు. ఆర్థిక వ్యవస్థలో తీవ్రమందగమనం పరిస్థితుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటు ముందు ఉంచనున్నారు.

మరిన్ని వార్తలు