స్టెర్లింగ్‌ చేతికి యూనిటెక్‌ విద్యుత్‌ వ్యాపారం

27 Mar, 2019 00:12 IST|Sakshi

డీల్‌ విలువ రూ.100 కోట్లు 

న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ కంపెనీ, యూనిటెక్‌ తన విద్యుత్తు పంపిణీ వ్యాపారాన్ని స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీకి విక్రయించింది. విద్యుత్‌ పంపిణీ లైన్ల తయారీ, ఇన్‌స్టలేషన్‌  కార్యకలాపాలు నిర్వహించే యూనిటెక్‌ పవర్‌ ట్రాన్సిమిషన్‌ను స్టెర్లింగ్‌ అండ్‌  విల్సన్‌ కంపెనీకి రూ.100 కోట్లకు విక్రయించామని యూనిటెక్‌ తెలిపింది. ఈ మేరకు షాపూర్‌జీ పల్లోంజీ ప్రమోట్‌ చేస్తున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీతో వాటా విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని వివరించింది.

ఈ వంద కోట్ల మొత్తాన్ని స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ సుప్రీం కోర్ట్‌లో డిపాజిట్‌ చేస్తుందని పేర్కొంది. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత యూనిటెక్‌ పవర్‌ట్రాన్సిమిషన్‌ కంపెనీ, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ పూర్తి అనుబంధ సంస్థగా మారుతుంది.  

మరిన్ని వార్తలు