టెకీలకు నాస్కామ్ కొత్త మంత్రం

19 May, 2017 11:28 IST|Sakshi
టెకీలకు నాస్కామ్ కొత్త మంత్రం
న్యూఢిల్లీ :  ఐటీ ఇండస్ట్రీలో పొంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగుల్లో తీవ్ర ఒత్తిళ్లు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో  ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ టెకీలకు కొత్త మంత్రం ఉపదేశిస్తోంది. నిరంతరం రీస్కిలింగ్ చేసుకోవాలని లేదా నిష్క్రమించడానికి సన్నద్దమై ఉండాలని నాస్కామ్ చెబుతోంది. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రిలో ఉన్న కొత్తమంత్రం ఇదేనని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖరన్ చెప్పారు.  ఇప్పటివరకున్న ఐటీ ప్రొఫిషినల్స్ లో 40 శాతం మంది తప్పనిసరిగా రీ-స్కిల్ చేసుకోవాల్సినవసరం ఉందని నాస్కామ్ పేర్కొంది. అంటే 40 లక్షల మంది వర్క్ ఫోర్స్ తమకు తాముగా రీస్కిల్ చేసుకుని, మారుతున్న మార్పులకు ఎదురొడ్డి పోరాడల్సిందే.  స్కిల్స్ ను అప్ గ్రేట్ చేసుకోవడంతో ఉద్యోగ పోయే ప్రమాద స్థాయిని తక్కువ చేసుకోవచ్చని నాస్కామ్ తెలిపింది.   ఆటోమేషన్ వంకతో ఇటీవల ఐటీ ఇండస్ట్రిలో భారీగా ఉద్యోగాల కోత చేపడుతున్న సంగతి తెలిసిందే. 
 
టెకీలు ఎక్కువ మొత్తంలో స్కిల్ అప్ గ్రేడేషన్ చేపట్టాల్సి ఉందని నాస్కామ్ బాడీ చైర్మన్ ప్రమన్ రాయ్ కూడా చెప్పారు. వర్చ్యువల్ రియాల్టి, అగ్మెంటెడ్ రియాల్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల గురించి ఎప్పడికప్పుడూ అప్ గ్రేడ్ అవుతుండాలని సూచించారు. ముందస్తు కంటే ప్రస్తుతం చాలా వేగవంతంగా రీ-స్కిల్ చేసుకోవాల్సినవసరం ఉందని టెక్ మహింద్రా సీఈవో సీపీ గుర్నాని చెప్పారు. ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల నుంచి సవాళ్లు ఎదురవుతున్నా.. దేశీయ ఐటీ ఇండస్ట్రి బలంగానే ఉంటుందని, కొత్త ఉద్యోగాల సృష్టి జరుపుతుందని తెలిపారు. ఐటీ ఇండస్ట్రిలో ఎలాంటి ఆందోళన లేదని, భారీగా ఉద్యోగాల కోత నిజం కాదని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆరులక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు