ఫెడ్‌ వడ్డీ రేటు పెంపు

14 Jun, 2018 08:06 IST|Sakshi
ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌

వాషింగ్టన్‌: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌  బుధవారం వడ్డీ రేట్లనుమళ్లీ  పెంచింది.  ప్రామాణిక ఫెడరల్‌ ఫండ్స్‌ రేటును 25శాతం పెంచింది.  తాజా పెంపుతో  ఫెడ్‌ ఫండ్‌ రేటు 1.75 శాతం నుంచి 2.0 శాతానికి చేరింది.   ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోం హెచ్. పోవెల్ మాట్లాడుతూ, 2008 ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థ గణనీయంగా బలపడిందని,  తిరిగి సాధారణ పరిస్తితికి  చేరుకుంటోందని పేర్కొన్నారు. 2018లో నిరుద్యోగిత రేటు అంచనాలను 3.6 శాతానికి తగ్గించింది.  2019లో మూడు సార్లు, 2020లో మరో ఒక దఫా రేట్ల పెంపు ఉండనుంది.

కాగా ఈ ఏడాది ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి కాగా   ఈ సంవత్సరం చివరికల్లా మరో రెండు సార్లు పెంపు ఉంటుందని యూఎస్‌ ఫెడ్‌  అధికారుల అంచనా. చివరిసారి గత మార్చిలో వడ్డీ రేట్లను పావు శాతం పెంచిన  ఫెడ్‌ 2015నుంచి ఏడుసార్లు వడ్డీరేట్లను పెంచినట్లయింది. అలాగే, 2019, 2020 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 2 శాతం పైనే ఉంటుందని కూడా అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు