షట్‌డౌన్‌కు తెర:మార్కెట్ల జోష్‌

23 Jan, 2018 10:10 IST|Sakshi

రిపబ్లికన్‌,  డెమోక్రాట్ల మధ్య సయోధ్య  నేపథ్యంలో అమెరికాలో షట్‌డౌన్‌ వివాదానికి తెరపడింది. అమెరికా ప్రతినిధుల సభ ఫిబ్రవరి 8 న ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ సెనేటర్లు తమ ఆమోదంతెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయనున్నామని ప్రకటించడంతో మూడురోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు పడింది. దీంతో అమెరికా ప్రభుత్వ సేవలు ప్రారంభమవుతాయని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు.

యూఎస్‌ సెనేటర్లు ఫెడరల్‌ ప్రభుత్వ , మూడు రోజుల   షట్‌డౌన్‌కు స్వస్తి పలుకుతూ 266-150 ఓట్లతో డీల్‌కు ఒకే చెప్పారు. ఫిబ్రవరి 8వరకూ అవాంతరాలు లేకుండా ప్రభుత్వం నడిచేందుకు వీలుగా  ఫండింగ్‌ లెజిస్లేషన్‌కు మద్దతును ప్రకటిచారు. ముఖ్యంగా  చిల్డ్రన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ (చిప్‌) ను ఆరు సంవత్సరాల పొడిగింపు సహా ఇతరాలతో  స్టాప్ గ్యాప్ బిల్లును ఆమోదించింది. కానీ డెమొక్రాట్ల  "డ్రీమర్" వలసదారులకు రక్షణకు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో ఉంది.  దీంతో అమెరికా మార్కెట్లలో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.  సోమవారం డోజోన్స్‌ 66 పాయింట్లు(0.25 శాతం) పురోగమించి 26,137 వద్ద ముగియగా.. ఎస్‌అండ్‌పీ 13 పాయింట్లు(0.5 శాతం) బలపడి 2,824 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 49 పాయింట్లు(0.7 శాతం) పురోగమించి 7,385 వద్ద ముగిసింది.

మరోవైపు దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా  లాభాలతో  ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ లాభాలతో 36వేల కీలక స్థాయిని అధిగమించగా, నిఫ్టీ  కూడా  చరిత్రలో తొలిసారి 11వేల మార్క్‌ను దాటి రికార్డ్‌ హైని నమోదు చేసింది. అటు జపాన్‌ మార్కెట్‌ నిక్కీ కూడా  మంగళవారం గరిష్ట స్థాయిలోనే ముగిసింది.

మరిన్ని వార్తలు