అమెరికాలో కోలుకున్న జాబ్ మార్కెట్

5 Aug, 2017 11:24 IST|Sakshi
అమెరికాలో కోలుకున్న జాబ్ మార్కెట్

వాషింగ్టన్: ఆర్థిక మందగమనంతో నిరుద్యోగం తాండవిస్తున్న అగ్రరాజ్యంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే ఆశలు చిగురిస్తున్నాయి. నిరుద్యోగిత రేటు దిగిరావడం, కొత్త కొలువులు పెరుగుతుండటం సానుకూల పరిణామాలుగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు 16 ఏళ్ల కనిష్టస్థాయిలో తగ్గింది.

జులైలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2,09,000 ఉద్యోగాలు పెరిగాయని ఇది మార్కెట్ అంచనాల కంటే అత్యధికమని కార్మిక శాఖ వెల్లడించింది. మే, జూన్ నెలల్లో కూడా ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగిందని సవరించిన అంచనాల్లో పేర్కొంది. జూన్ లో 4.4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జులైలో 4.3 శాతానికి దిగివచ్చింది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ  పుంజుకుంటుందనేందుకు ఇది మెరుగైన సంకేతమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు