ఎఫ్డీఏ చర్యలతో ఎగుమతులకు దెబ్బ

7 Apr, 2016 01:02 IST|Sakshi
ఎఫ్డీఏ చర్యలతో ఎగుమతులకు దెబ్బ

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఫార్మా కంపెనీలపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నియంత్రణ చర్యల కారణంగా దేశీ ఎగుమతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి తెలిపారు. ఈ అంశమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ఇక్కడ జరిగిన బోర్డు ఆఫ్ ట్రేడ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఫార్మా ఎగుమతులు 9.7 శాతం మేర పెరిగినా కూడా గతంతో పోలిస్తే తక్కువ వృద్ధినే న మోదు చేశాయని తెలిపారు. తమ వృద్ధి సామర్థ్యానికి తగిన విధంగా లేదని చెప్పారు.

అమెరికాకు జరిగే ఫార్మా ఎగుమతులను పలు అంశాలు ప్రభావితం చేస్తున్నాయని, వాటిల్లో ఎఫ్‌డీఏ చర్యలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. వెనిజులాలో 350 మిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని, కానీ అక్కడ మన ఫార్మా ఎగుమతులపై నిషేధం ఉండటంతో ఆశలు వదులుకున్నామని చెప్పారు. ఇటీవల సన్ ఫార్మా, లుపిన్, వోకార్డ్ వంటి దిగ్గజ ఫార్మా కంపెనీలన్నీ తయారీ నిబంధనలు సరిగా లేకపోవడం వల్ల ఎఫ్‌డీఏ తనిఖీలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది గతేడాది నవంబర్‌లో ఏపీ, తెలంగాణాలోని ప్లాంట్లకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్‌కి కూడా హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు