దివీస్‌ యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు

21 Sep, 2017 01:15 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా కంపెనీ దివిస్‌ ల్యాబొరేటరీస్‌కు చెందిన యూనిట్‌–2లో యూఎస్‌ఎఫ్‌డీఏ సెప్టెంబరు 11–19 మధ్య  తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆరు లోపాలను ఎఫ్‌డీఏ లేవనెత్తిందని కంపెనీ వెల్లడించింది. ఇవన్నీ కూడా విధానపరమైనవేనని, నిర్దేశిత సమయంలోగా లోపాలను సరిదిద్దుకుంటామని తెలిపింది. ఎఫ్‌డీఏ జారీ చేసిన ఫామ్‌–483 ప్రకారం ఏ కంపెనీ అయినా 15 రోజుల్లోగా లోపాలను సరిదిద్దుకోవాలి.

ఎఫ్‌డీఏ తిరిగి విశ్లేషించి తగు నిర్ణయం తీసుకుంటుంది. విశాఖలోని ఈ యూనిట్‌ నుంచి ఔషధాల దిగుమతిని నిషేధిస్తూ 2017 మార్చిలో యూఎస్‌ఎఫ్‌డీఏ ఇంపోర్ట్‌ అలర్ట్‌ విధించింది. అలాగే మే నెలలో వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, బీఎస్‌ఈలో బుధవారం దివిస్‌ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 9.13 శాతం వృద్ధితో రూ.942.75 వద్ధ స్థిరపడింది. 

మరిన్ని వార్తలు