టెక్నాలజీతో పోటీతత్వాన్ని పెంచుకోవాలి..

26 Apr, 2015 01:27 IST|Sakshi
టెక్నాలజీతో పోటీతత్వాన్ని పెంచుకోవాలి..

సేవల రంగ సంస్థలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచన
న్యూఢిల్లీ: అత్యంత అధునాతన టెక్నాలజీలు వస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై పరిమితులు విధించడం వల్ల ప్రయోజనం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంస్థలతో దీటుగా పోటీపడేలా సర్వీస్ ప్రొవైడర్లు అంతర్గత సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని, ఇందుకు టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవచ్చని సూచించారు.

రాబోయే రోజుల్లో టెక్నాలజీ మరింత కీలక పాత్ర పోషిస్తుందని గ్లోబల్ ఎగ్జిబిషన్ ఆన్ సర్వీసెస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద రిటైలరుకు సొంత స్టోర్ ఒక్కటి కూడా లేదు. అత్యంత పెద్ద రవాణా సంస్థకు సొంత వాహనం ఒక్కటీ లేదు. టెక్నాలజీ ఊతంతోనే ఇవి ఇంత భారీగా ఎదిగాయి’ అని జైట్లీ వివరించారు. సేవల రంగం మరింత వృద్ధి చెందాల్సి అవసరం ఉందని పేర్కొంటూ, ఇందుకు ప్రస్తుతం ఆయా వర్గాల మైండ్‌సెట్ మారాల్సి ఉంటుందని అన్నారు.

మరిన్ని వార్తలు