మరో భారీ కుంభకోణం: వేలకోట్ల రూపాయలకు టోకరా

5 Apr, 2018 19:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మరో భారీ బ్యాంకింగ్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వడోదరకు చెందిన విద్యుత్ కేబుల్స్, సామగ్రిని తయారు చేసే కంపెనీ వేలకోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టింది.  11 బ్యాంకుల  కన్సార్టియాన్ని భారీ ఎత్తున మోసం చేసిన వ్యవహారంలో  కేసు నమోదు చేశామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ప్రకటించింది.  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా  లోన్ డిఫాల్టర్ల లిస్ట్‌లోనూ, ఎక్స్‌పోర్ట్‌  క్రెడిట్ హామీ కార్పొరేషన్ హెచ్చరిక జాబితాలో ఉన్నప్పటికీ  కంపెనీ, దాని డైరెక్టర్లు  తప్పుడు పద్ధతుల్లో రుణాలు పొందారని ఆరోపించింది. 

వివిధ బ్యాంకుల నుంచి అక్రమ మార్గాల్లో  డైమెండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డిపిఐఎల్) రూ. 2,654 కోట్ల  రుణాలను తీసుకుందని సీబీఐ తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి కంపెనీపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కంపెనీ ప్రమోటర్‌ ఎస్‌ఎన్‌ భట్నాగర్‌, అతని కుమారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అమిత్‌ భట్నాగర్‌, సుమిత్‌ భట్నాగర్‌లపై కేసు నమోదు చేశామని సీబీఐ  అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా- రూ.670.51కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా- రూ.349 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు- 279.46 కోట్ల రూపాయలు రుణాలు పొందినట్టుగా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అలాగే గుజరాత్‌ వడోదరాలోని కంపెనీ కార్యాలయంతో పాటు  డైరెక్టర్ల నిసాసాల్లో సీబీఐ  సోదాలు ప్రారంభించింది.

కాగా సీబీఐ అందించిన సమాచారం ప్రకారం 2008 జూన్‌లో యాక్సిస్‌ బ్యాంకు నేతృత్వంలోని 11బ్యాంకుల కన్సార్టియం (పబ్లిక్‌, ప్రైవేట్‌​) ద్వారా మోసపూరితంగా డిపిఐఎల్ రుణాలను పొందింది.  నగదు క్రెడిట్ పరిమితులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రధాన బ్యాంకుగా ఉంది.  ఈ మొత్తం 2016 జూన్ 29 నాటికి రూ .2,654.40 కోట్ల రూపాయలకు చేరింది. అయితే  2016-17లో ఎన్‌పీఏగా  ప్రకటించడం గమనార్హం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

నష్టాల్లో సూచీలు : బ్యాంకుల జోరు

హ్యుందాయ్‌ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?

విప్రో లాభం 2,388 కోట్లు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌