భీమిలి తీరంలో వరుణ్ బీచ్ రిసార్ట్స్

5 Jul, 2016 00:48 IST|Sakshi
భీమిలి తీరంలో వరుణ్ బీచ్ రిసార్ట్స్

ప్రారంభించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
భీమునిపట్నం: విశాఖ జిల్లా భీమిలి సాగరతీరంలో నిర్మించిన వరుణ్ బీచ్ రిసార్ట్స్ పర్యాటకులకు చక్కని అనుభూతిని అందిస్తాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు అన్నారు. కొత్తగా నిర్మించిన రిసార్ట్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఎంతో ఆహ్లాదకరమైన భీమిలి తీరంలో సరైన వసతి లేక పర్యాటకులకు వెలితిగా ఉండేదని, ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వరుణ్ బీచ్ రిసార్ట్స్ ఆ వెలితిని తీర్చి, పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయన్నారు.

నోవాటెల్ హోటల్ మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్ ప్రభుకిశోర్ మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న పర్యాటకులకు చక్కని అనుభూతి పంచాలన్న లక్ష్యంతో ఈ రిసార్ట్స్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో విశాఖ నొవాటెల్ హాటల్ సమీపంలో సముద్రంలో జెట్టీలాంటిది ఏర్పాటు చేసి పర్యాటకులు బోట్లలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర జలాల్లో విహరించే అవకాశం కల్పిస్తామన్నారు. భీమిలిలోనూ అటువంటిది ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. గోవా

 త రహాలో ఇక్కడ తీరంలో అన్ని రకాల హంగులు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎకార్ హోటల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బియాన్ మైకేల్ కాజ్, వరుణ్ బీచ్ రిసార్ట్స్ జనరల్ మేనేజర్ మాధవ్ బెల్లంకొండ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు