వేదాంత లాభం రూ.5,675 కోట్లు

4 May, 2018 00:51 IST|Sakshi

ఆదాయం రూ. 27,630 కోట్లు

న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.5,675 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో రూ.3,226 కోట్ల లాభంతో పోలిస్తే 34% వృద్ధి చెందింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 17% పెరిగి రూ.27,630 కోట్లకు చేరింది.

అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.23,961 కోట్లు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2017–18) లాభం 21% వృద్ధితో అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.11,319 కోట్ల నుంచి రూ.13,692 కోట్లకు చేరింది.

ఫలితాల వెల్లడి సందర్భంగా వేదాంత  సీఈవో కుల్దీప్‌ కౌర మాట్లాడుతూ... ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ అధిక ఎబిటా నమోదు చేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గోవాలో మైనింగ్‌ కార్యకలాపాలను మార్చిలో మూసివేయడం వల్ల నాలుగో క్వార్టర్లో ఏమంత ప్రభావం చూపించలేదని తెలిపారు. 2017–18 సంవత్సరం వేదాంతకు మార్పుతో కూడినదని సంస్థ చైర్మన్‌ నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కంపెనీకి ఉన్న వృద్ధి అవకావాలు వాటాదారుల విలువను మరింత పెంచేవిగా తెలిపారు.  

మరిన్ని వార్తలు