వేదాంతా లాభాలు ఓకే

31 Jul, 2018 18:23 IST|Sakshi

సాక్షి, ముంబై:   మెటల్‌, మైనింగ్‌ దిగ్గజం వేదాంత క్యూ1 ఫలితాల్లో  పరవాలేదనిపించింది. మొదటి త్రైమాసికంలో నికర లాభంలో స్వల్ప ( 0.7 శాతం) వృద్ధిని  నమోదు చేసింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌లో 2233 కోట్లతో పోలిస్తే తాజాగా రూ. 2248 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 21.4 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.22,206 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  ఎబిటా 28.4 శాతం - రూ.6284 కోట్లగా ఉంది.
 తమిళనాడులో ప్లాంటును ఆందోళన కారణంగా మూసివేయాల్సి వచ్చిందని, దీన్ని తెరిపించేందుకు ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నట్టు వేదాంతా ఛైర్మన్‌ అనిల్‌అగర్వాల్‌ ప్రకటించారు.   తద్వారా 100 మిలియన్‌ డాలర్లను నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. అయితే అల్యూమినియం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌  జింక్‌ గణనీయమైన ఉత్పత్తితో  ఈ లాభాలను సాధించినట్టు సీఈవో కుల్‌దీప్‌ కూరా  ఫలితాల ప్రకటన సందర్భంగా వెల్లడించారు.  ప్రాజెక్టులు పురోభివృద్ధితో రాబోయే క్వార్టర్లలో  మరిన్ని మైలురాళ్లను అధిగమించనున్నామని చెప్పారు. కాగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎబిటా - రూ.852 కోట్లు, ఐరన్ అండ్ ఓర్ ఎబిటా రూ.163 కోట్లు, అల్యూమినియం ఎబిటా రూ.1259 కోట్లు,  పవర్ ఎబిటా రూ.425 కోట్లుగా నమోదు చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎస్‌బీఐ సేవింగ్స్‌ డిపాజిట్‌ రేట్ల కోత

సెన్సెక్స్‌ 2,476 పాయింట్లు అప్‌

లాభాల జోరు,  30వేల ఎగువకు సెన్సెక్స్

55 పైసలు ఎగిసిన రూపాయి

నియామకాలపై కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్