వేదాంత రిసోర్సెస్‌లో 4,000 ఉద్యోగాల కోత

23 Sep, 2015 23:35 IST|Sakshi
వేదాంత రిసోర్సెస్‌లో 4,000 ఉద్యోగాల కోత

న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఈ ఏడాది ఇప్పటివరకూ 4,000 ఉద్యోగాలను తొలగించింది. చమురు, గ్యాస్, అల్యూమినియం, ఇనుము, జింక్ రంగాల్లో వేదాంత అల్యూమినియం, బాల్కో, కెయిర్న్ ఇండియా, సెసా గోవ సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 4,000 వరకూ ప్రత్యక్ష. పరోక్ష ఉద్యోగాలను తొలగించింది. వీటిల్లో 2,700 వరకూ ప్రత్యక్ష ఉద్యోగాలున్నాయి. బాల్కో 1,000 ఉద్యోగాలను, వేదాంత అల్యూమినియం 2,000, సెసా గోవ, కెయిర్న్ ఇండియాలు చెరో 450 చొప్పున ఉద్యోగాల్లో కోత విధించాయి. మార్కెట్ మందగమన ధోరణి వల్ల పలు వ్యయ నియంత్రణ పద్ధతులను చేపట్టామని  సంస్థ ప్రకటించిన నేపథ్యంలో తాజా తొలగింపులు చోటుచేసుకున్నాయి.

మరిన్ని వార్తలు