ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్‌

9 Jun, 2017 18:26 IST|Sakshi
ఆ ఒప్పందంతో 2 వేల ఉద్యోగాలు ఢమాల్‌

ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలిగిన యాహూను సొంతం చేసుకున్న  వెరిజోన్‌ కమ్యూనికేషన్‌ ఇంక్‌  ఉద్యోగులపై భారీ వేటు వేయనుంది.   యాహూ కొనుగోలు ఒప్పందం నేపథ్యంలో  రెండు కంపెనీలకు చెందిన దాదాపు  2 వేల మందిని ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం  2 వేల ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్‌  తొలగించనుంది. మొత్తం 4.48 బిలియన్ డాలర్లు ఒప్పందం పూర్తయిన అనంతరం ఈ తొలగింపులను చేపట్టనుంది.   రెండు యూనిట్లకు చెందిన 15శాతం ఉద్యోగులను తగ్గించనుంది వీటిలోముఖ్యంగా కాలిఫోర్నియా సహా, అమెరికా వెలుపల ఉద్యోగులు ఇందులో  ఉన్నారు.

 మరోవైపు యాహూ- వెరిజోన్‌ విలీనానికి వాటాదారుల  సాధారణ సమావేశం  గురువారం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం కంపెనీ విక్రయ ప్ర్రకియ మంగళవారం పూర్తి కానుంది.  వెరిజోన్‌ , యాహూ  విలీనంతో  కొత్త వెంచర్‌ ఓథ్‌  ఉనికి లోనికి రానుంది. వెరిజోన్‌కు చెందిన  అమెరికన్ మల్టీనేషనల్ మాస్ మీడియా కార్పొరేషన్ ఏఓఎల్‌​ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ ఆర్‌ స్ట్రాంగ్‌  నేతృత్వంలోని ఓథ్ అనే నూతన సంస్థగా రీబ్రాండ్‌ అయింది.

కాగా 2012లో  యాహూ సీఈవోగాఎంపికైన మెరిస్సా  మేయర్‌  పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవడంతో వివాదం రగిలింది. ఈ క్రమంలోనే  2015లో యాహూ, తన వ్యాపారంలోని ముఖ్య విభాగాలైన డిజిటల్ అడ్వర్టయిజింగ్, ఈ-మెయిల్, మీడియా విభాగాలను వేరిజోన్ కు విక్రయించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు