ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా కన్నుమూత

3 Jul, 2019 18:19 IST|Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త, సెంచరీ టెక్స్‌టైల్స్‌ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ , కుమార్ మంగళం బిర్లా తాత  బసంత్‌ కుమార్‌ బిర్లా (బీకే బిర్లా  98)  బుధవారం ముంబైలో కన్నుమూశారు. బి.కె.బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల నడుపుతున్న కృష్ణార్పణ్‌ ఛారిటీ ట్రస్ట్ చైర్మన్ కూడా అయిన బిర్లా ఖతార్‌లోని బిర్లా పబ్లిక్ స్కూల్‌,  ముంబై సమీపంలోని కళ్యాణ్‌లో బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్   అండ్‌  కామర్స్ స్థాపించారు. 

బిర్లాకు ఇద్దరు కుమార్తెలు జయశ్రీ మెహతా, మంజుశ్రీ ఖైతాను  ఉన్నారు. అయితే కుమారుడు ఆదిత్య విక్రం బిర్లా, (కుమార మంగళం తండ్రి)1995, అక్టోబరులో మరణించారు. ప్రముఖ దాత ఘనశ్యామ్‌ దాస్‌  చిన్న కుమారుడైన బీకేబిర్లా పత్తి, సిమెంట్‌, ప్లై వుడ్‌, పేపర్‌, విస్కోస్, పాలిస్టర్, నైలాన్‌, పేపర్‌ షిప్పింగ్, టైర్‌కార్డ్,  టీ, కాఫీ, ఏలకులు, రసాయనాలు తదితర రంగాల్లో కీలక వ్యాపారాలను కలిగి ఉన్నారు. 15 ఏళ్ల ప్రాయం నుంచే పలు వ్యాపార కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించిన బీకే బిర్లా కేశోరాం ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా తన కరియర్‌ను ప్రారంభించారు. బీకే బిర్లా మృతిపట్ల పలువురు పరిశ్రమ పెద్దలు, ఇతర పారిశ్రామిక వేత్తలు  తీవ్ర  దిగ్భ్రాంతిని వక్తం చేశారు. వ్యాపార రంగానికి బిర్లా ఎనలేని సేవలందించారంటూ తమ సంతాపాన్ని  ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు