వీడియోకాన్ డీ2హెచ్ కంటెంట్ హెడ్‌గా హిమాన్షు

11 Sep, 2015 02:05 IST|Sakshi
వీడియోకాన్ డీ2హెచ్ కంటెంట్ హెడ్‌గా హిమాన్షు

వీడియోకాన్ డీ2హెచ్ కంటెంట్ చీఫ్‌గా హిమాన్షు ధొరీలియా నియమితులయ్యారు. ప్రముఖ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీల్లో పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉంది. ఇటీవల ఆయన టెలివిజన్‌పోస్ట్.కామ్ సీఈఓ, సహ వ్యవస్థాపకులుగా  పనిచేశారు. వీడియోకాన్ కంటెంట్ మరింత మెరుగుకు ఈ నియామకం దోహదపడుతుందని ఒక ప్రకటనలో వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించడానికి  హిమాన్షు ధొరీలియా ప్రణాళికలు ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్లు సీఈఓ అనిల్ ఖేరా తెలిపారు. దాదాపు 525 చానెళ్ల ప్రసారం, సేవలతో వీడియోకాన్ డీ2హెచ్ వేగంగా విస్తరిస్తోందని ప్రకటన తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా