త్వరలోనే భారత్‌కు విజయ్‌ మాల్యా..

3 Jun, 2020 16:15 IST|Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ దిగ్గజం విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా బ్రిటన్‌లో న్యాయపరమైన అన్ని అవకాశాలను కోల్పోయారని కేం‍ద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే మే 14న విజయ్‌ మాల్యా దాఖలు చేసిన అన్ని పిటిషన్లను యూకే సుప్రీం కోర్టు కొట్టేసిందని అధికారులు తెలిపారు. మాల్యా దేశంలోకి రావడానికి   28 రోజులు పట్టవచ్చని.. మొదటగా అతడిని కస్టడిలోకి తీసుకొని విచారిస్తామని సీబీఐకి చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మాల్యా భారత్‌లోకి ప్రవేశించగానే ఏ విధంగా విచారించాలో వ్యూహాలు రచిస్తున్నట్లు సీబీఐ, ఈడీ అధికారులు తెలిపారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతపడడం, ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాల్యా భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి అన్ని అవకాశాలను కోల్పోయారని యూకే న్యాయ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: డబ్బులు తిరిగిస్తా.. తీసుకోండి! 

>
మరిన్ని వార్తలు