కోపానికి, అహంకారానికి మాల్యా బాధితుడు

26 Dec, 2017 10:36 IST|Sakshi

ముంబై : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు విజయమాల్యా కోపానికి, అహంకారానికి బాధితుడని ఎయిర్‌డెక్కన్‌ చైర్మన్‌ జీ ఆర్‌ గోపినాథ్‌ అన్నారు. రాజకీయ కుట్ర కంటే కూడా ఆయన ఎక్కువగా కోప, అహంకారాల్లోనే ఇరుక్కుపోయారని చెప్పారు. 2007లో ఎయిర్‌డెక్కన్‌ను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు రూ.1000 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం 2012లో కింగ్‌ఫిషర్‌ దివాలా స్థాయికి పడిపోయింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల బకాయిపడింది. బ్యాంకులకు రుణ పడిన ఈ కోట్ల మొత్తాన్ని ఎగ్గొట్టిన మాల్యా యూకేకు పారిపోయారు. ప్రస్తుతం మాల్యా యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

ఆయన్ను భారత్‌కు రప్పించడానికి ఏజెన్సీలు తీవ్ర ఎత్తున్న కసరత్తు చేస్తున్నాయి. మాల్యా అప్పగింత కేసును లండన్‌ కోర్టు విచారిస్తోంది. ఆయనను పొలిటికల్‌ ఫుట్‌బాల్‌లా రిఫర్‌ చేస్తూ.... డిఫాల్డ్‌ అయిన సమయంలో మాల్యా తన కార్యక్రమాల్లో అంత తెలివిగా ఉండేవారు కాదని పేర్కొన్నారు. రుణాల ఎగవేతకు మాల్యా పోస్టర్‌ బాయ్‌లా ఉన్నారని అభివర్ణించారు. రెండు పార్టీలు కూడా తాము సౌకర్యవంతం కోసం రాజకీయంగానే గుర్తిస్తున్నారన్నారు. మాల్యా రాజకీయ కుట్రకు బాధితుడు కాదని, ఆయన ప్రతి ఒక్కరికీ 'హాట్‌ పొటాటో' అన్నారు. 

మరిన్ని వార్తలు