నగరంలో విల్లామెంట్‌ గృహాలు

27 May, 2017 00:07 IST|Sakshi
నగరంలో విల్లామెంట్‌ గృహాలు

విల్లా+అపార్ట్‌మెంట్‌= విల్లామెంట్‌
20 ఎకరాల్లో 700  గృహాలు


వ్యక్తిగత గృహాలు, అపార్ట్‌మెంట్స్, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు ఇదీ వరస! ఇప్పుడీ జాబితాలో విల్లామెంట్‌ చేరింది.  విల్లా+అపార్ట్‌మెంట్‌ రెండూ కలిపితే విల్లామెంట్‌. నగరంలో కొత్త తరహా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ప్రజయ్‌ ఇంజనీర్స్‌ సిండికేట్‌! ప్రాజెక్ట్‌ విశేషాలు సంస్థ సీఎండీ విజయ్‌సేన్‌ రెడ్డి మాటల్లోనే..

సాక్షి, హైదరాబాద్‌:
సాధారణంగా వ్యక్తిగత గృహాల్లో స్థలం తక్కువగా వస్తుంది. ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువ రావటం కోసం కొత్తగా విల్లామెంట్‌ సంస్కృతికి తెరతీశాం. విల్లాల్లోని స్థలం, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు రెండూ కలిపి విల్లామెంట్‌లో ఉంటాయన్నమాట. షామీర్‌పేటలోని 27.18 ఎకరాల్లో ప్రజయ్‌ వాటర్‌ ఫ్రంట్‌ సిటీ ఫేజ్‌–2 ప్రాజెక్ట్‌ ఉంది. ఇందులో 20 ఎకరాల్లో విల్లామెంట్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం.
20 ఎకరాల్లో మొత్తం 700 విల్లామెంట్లొస్తాయి. 240 గజాల్లో జీ+2 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 2, పై అంతస్తులో 2 ఫ్లాట్లుంటాయి. 4 ఫ్లాట్లు కూడా 835 చ.అ.ల్లో విస్తరించి ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఫ్లాట్ల ధర రూ.18.85 లక్షలు, పై అంతస్తులోని ఫ్లాట్ల ధర రూ.17.85 లక్షలు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కొనుగోలుదారులకు ముందు స్థలం, పై అంతస్తులోని వారికి టెర్రస్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తాం.
వసతుల విషయానికొస్తే.. 45 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌ పూల్, పార్కు, జాగింగ్, సైక్లింగ్‌ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్‌ డోర్‌ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌ కోర్టులు, క్రికెట్, ఫుట్‌ బాల్‌ మైదానాలు, ప్రాజెక్ట్‌లోనే షాపింగ్‌ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటాయి.
ప్రజయ్‌ వాటర్‌ ఫ్రంట్‌ సిటీ ఫేజ్‌–2లో కొంత భాగంలో అందుబాటు గృహాలను కూడా నిర్మిస్తున్నాం.  ఇప్పటికే ఆయా గృహాలు అమ్మకాలు 80 శాతం పూర్తయ్యాయి కూడా. 835 చ.అ.ల్లో ఉండే ఒక్కో ఇంటి ధర రూ.23 లక్షలు.
త్వరలోనే మహేశ్వరంలో వర్జిన్‌ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్‌ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్‌కేసర్‌లో విన్సర్‌పాక్‌ ప్రాజెక్ట్‌లో 1,200 నిర్మాణాలను ప్రారంభించనున్నాం.

మరిన్ని వార్తలు