ఆ గోల్డెన్‌ బైక్స్‌ మళ్లీ వస్తున్నాయ్‌!

17 Aug, 2019 13:23 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతీయ  ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి మరో గోల్డెన్‌ బైక్స్‌ రీఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పలు  సంకేతాలు సందడి చేస్తున్నాయి. 2020 ఆటో ఎక్స్‌పో నాటికి ఈ బైక్స్‌ పరిచేయాలని కంపెనీ యోచిస్తోందట.  ఈ కంపెనీ పేరే యెజ్డీ మోటార్‌  సైకిల్స్‌. మహీంద్ర అండ్‌ మహీంద్ర సొంతమైన ఈ క్లాసిక్‌ కంపెనీ తన ఐకానిక్‌ యెజ్డీ బైక్‌లను తిరిగి లాంచ్‌ చేస్తోంది. ప్రధానంగా ఇటీవల భారత మార్కెట్లో రీఎంట్రీ ఇచ్చిన జావా బైక్‌లు హల్‌చల్‌ చేస్తున్న నేపథ్యంలో కంపెనీ తాజా నిర్ణయం తీసుకుంది.  లాంచింగ్‌పై కచ్చితమైన  తేదీని  ప్రకటించకపోయినప్పటికీ,  భారత బైక్‌ మార్కెట్‌ను ఏలిన యెజ్డీ  మోటార్‌ సైకిల్స్‌ బైక్స్‌  అధికారిక పేజీ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంది. ఈ పేజీలో కొన్ని వివరాలను కూడా పొందుపర్చింది. అలాగే  ఆఫీషియల్ ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్  తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు  యెజ్డీ బైక్‌ల లాంచింగ్‌పై స్పష్టమైన సంకేతాలని నిస్తున్నాయి. 


 

మరిన్ని వార్తలు