క్యూ1లో విశాఖ ఉక్కు ఉత్పత్తి 8% వృద్ధి

6 Jul, 2014 01:04 IST|Sakshi
క్యూ1లో విశాఖ ఉక్కు ఉత్పత్తి 8% వృద్ధి

ఉక్కునగరం(విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లిక్విడ్ స్టీల్, క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 8% వృద్ధిని సాధించింది. విద్యుత్ నియంత్రణ, పవర్ హాలీడే ఉన్నప్పటికీ ఉత్పత్తి, సాంకేతిక అంశాల్లో మంచి ప్రతిభ కనబరిచింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో బ్లాస్ట్‌ఫర్నేస్ ఉత్పాదకతలో 47%, ఇంధన వినియోగంలో 3%, ఇంధన పొదుపులో 2%, నీటి వినియోగంలో 5%, కార్మిక ఉత్పాదకతలో 1% గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వృద్ధి సాధించింది.

జూన్ 14న ప్రారంభించిన బ్లాస్ట్‌ఫర్నేస్ గ్యాస్‌తో నడిచే టాప్ రికవరీ టర్బైన్ ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌లో మొట్టమొదటిసారిగా ప్రారంభించిన నీడో ప్రాజెక్ట్‌లో సింటర్‌మిషన్ ద్వారా విడుదలయ్యే వేడిమి నుంచి 20.6 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. మొదటి త్రైమాసికంలో రూ. 2661 కోట్ల టర్నోవర్‌ను, ఎగుమతుల్లో 7% వృద్ధిని సాధించడం విశేషం.

మరిన్ని వార్తలు