విశాల్‌ సిక్కా భార్య వందన రాజీనామా

29 Aug, 2017 15:01 IST|Sakshi
విశాల్‌ సిక్కా భార్య వందన రాజీనామా

బెంగళూరు: ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ లో మరోకీలక పరిణామం  చోటు చేసుకుంది.  కంపెనీ మాజీ సీఎండీ  విశాల్ సిక్కా భార్య వందన సిక్కా ఐటీ సేవల  దాతృత్వ సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను వీడారు. కంపెనీకి  అందించిన ఈమెయిల్‌ ద్వారా ఈ సమాచారం అందించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ యుఎస్ఎ ఛైర్‌ పర్సన్‌గా తన  పాత్రనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.  అలాగే తన రాజీనామా  విషయాన్ని తన బ్లాగ్‌లో, ట్విట్టర్‌లో కూడా  పేర్కొన్నారు.

కంపెనీ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామాచేయడంతో ఆయన భార్యకూడా  ఇన్ఫోసిస్ ఫౌండేషన్  ఛైర‍్మన్‌ పదవికి గుడ్‌ బై చెప్పారు.  రెండున్నర సంవత్సరాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు ఆమె పనిచేశారు.  కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌లో చేరకముందు ఒక స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించాలని  యోచించారు.  
 

మరిన్ని వార్తలు