ఇన్ఫోసిస్‌ సిక్కా జీతం 67 శాతం డౌన్‌

25 May, 2017 01:00 IST|Sakshi
ఇన్ఫోసిస్‌ సిక్కా జీతం 67 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: అధిక వేతనాలందుకుంటున్నారంటూ విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా జీతం వాస్తవానికి 2016–17లో 67 శాతం తగ్గిపోయింది. బోనస్‌ పరిమాణం తగ్గడమే దీనికి కారణం. ఇన్ఫోసిస్‌ వార్షిక నివేదిక ప్రకారం 2016–17లో సిక్కా జీతంలో నగదు పరిమాణం రూ.16.01 కోట్లుగా ఉంది. 2015–16లో ఇది రూ.48.73 కోట్లు.

ఇక బోనస్, గ్రాంట్‌ ఆఫ్‌ స్టాక్స్‌ మొదలైనవన్నీ కూడా కలుపుకుంటే.. జీతభత్యాలు 7 శాతం తగ్గి రూ. 48.41 కోట్ల నుంచి రూ. 45.11 కోట్లకు చేరినట్లు లెక్క. ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సగటు వార్షిక వేతనంతో (ఎంఆర్‌ఈ) పోలిస్తే సిక్కా రెమ్యూనరేషన్‌ 283.07 రెట్లు అధికంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇన్ఫోసిస్‌ ఎంఆర్‌ఈ రూ. 5,65,585.

మరిన్ని వార్తలు