విస్తారా టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌

11 Jan, 2017 01:55 IST|Sakshi
విస్తారా టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా తన రెండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఇందులో భాగంగా ఎకానమీ తరగతి ప్రయాణానికి సంబంధించిన టికెట్లను రూ.899ల ప్రారంభ ధరతో ప్రయాణికులకు అందిస్తోంది. నేటి నుంచి జనవరి 12 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్న వారు జనవరి 25 నుంచి అక్టోబర్‌ 1 వరకు ఉన్న మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని విస్తారా వివరించింది. ఈ పరిమిత కాల ఆఫర్‌ కేవలం దేశీ నెట్‌వర్క్‌కు మాత్రమే వరిస్తుందని పేర్కొంది. సంస్థ  వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్లను బుకింగ్‌ చేసుకునే కస్టమర్లు రూ.500 విలువైన గిఫ్ట్‌ వోచర్స్‌ను పొందొచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు