జీతంలేని సెలవుపై విస్తారా సీనియర్ ఉద్యోగులు

15 Apr, 2020 15:27 IST|Sakshi

1200 మంది విస్తారా ఉద్యోగులకు షాక్ 

సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో విమానయాన సంస్థల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం ఆయా విమానయాన సంస్థల ఉద్యోగులపై భారీగా పడుతోంది. తాజాగా విస్తారా ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సీనియర్ గ్రేడ్ ఉద్యోగులను 3 రోజులపాటు నిర్బంధ సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. జీతంలేని తప్పనిసరి సెలవు తీసుకోవాల్సిందిగా దాదాపు 1200 మంది సీనియర్లను కోరింది. నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సంస్థ జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని విస్తారా ఉద్యోగులను కోరడం ఇది రెండోసారి. లాక్ డౌన్ పొడిగింపుతో కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశామనీ, ఇది తమ న గదు  లభ్యతపై గణనీయంగా ప్రభావం చూపిందని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌  సమాచారంలో విస్తారా సీఈవో లెస్లీ థంగ్ చెప్పారు.

కరోనా వైరస్  ముప్పు.. లాక్‌డౌన్‌ కష్టాల మధ్య సంస్థ ఆర్థిక వనరులను పరిరక్షించే చర్యగా ఏప్రిల్ 15 - ఏప్రిల్30 మధ్య మూడు రోజుల వరకు వేతనం లేకుండా తప్పనిసరి సెలవుపై వెళుతున్నట్లు  లెస్లీ థంగ్ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 -ఏప్రిల్ 14 మధ్య మూడు రోజుల వరకు జీతం లేకుండా తప్పనిసరి సెలవు తీసుకోవాలని మార్చి 27న ప్రకటించింది. ఈ సెలవు నుంచి  2800 మంది ఉద్యోగుల (క్యాబిన్, గ్రౌండ్ సర్వీసు)కు మినహాయింపు నిచ్చింది. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా  విధించిన 21  రోజుల లాక్ డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం. కరోనా ముప్పు కారణంగా దేశీయ,  అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) (అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్)

మరిన్ని వార్తలు