విస్తారాకు రూ. 2వేల కోట్ల నిధులు

24 Oct, 2018 19:36 IST|Sakshi

సాక్షి,ముంబై: విస్తరణ ప్రణాళికల్లో విస్తారా ఎయిర్‌లైన్స్‌ భారీ ఆఫర్‌ దక్కించుకుంది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి రూ.2వేల కోట్ల నిధులను ఆర్జించింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌అందించిన సమాచారం ప్రకారం 200కోట్ల రూపాయల విలువవైన ఈ క్విటీ షేర్లను (షేరు రూ.10) టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించేందుకు అక్టోబరు 12న విస్టారా బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టాటా సన్స్‌కు 101.99 కోట్ల షేర్లను, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 98 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ మేరకు రూ. 2వేలకోట్ల  నిధులు విస్తారాకు అందనున్నాయి. అయితే ఈ ఫండ్ ఇన్ఫ్యూషన్ గురించి విస్తారా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కాగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ టాటా సన్స్ 51 శాతం వాటాను కలిగి వుండగా మిగతా 49 శాతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ సొంతం. టాటాలకు మెజారిటీ వాటా ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ మూడేళ్ల క్రితం కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం 22 విమానాలను కలిగి ఉంది. తాజాగా విదేశాలకు కూడా సర్వీసులను విస్తరించాలనే వ్యూహంలో ఉంది.

మరిన్ని వార్తలు