భారత్‌లో భారీ పెట్టుబడుల దిశగా ‘వివో’

28 Aug, 2019 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వివో’.. భారీ విస్తరణ ప్రణాళికను చేపట్టనుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా మరో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. రానున్న కాలంలో తాజా పెట్టుబడి ద్వారా ఇక్కడ తమ మొత్తం పెట్టుబడి రూ.7,500 కోట్లకు చేరనుందని వివరించింది. తొలి దశ వచ్చే నెల్లో సిద్ధం కానుండగా.. ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2.5 కోట్ల యూనిట్ల నుంచి 3.34 కోట్ల యూనిట్లకు చేరుకోనుందని వెల్లడించింది. నూతనంగా మరో 2,700 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. వచ్చే 10 ఏళ్లలో 40,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కింది. 

మరిన్ని వార్తలు