అద్భుత ఫీచర్లతో వివో స్మార్ట్‌ఫోన్, భారీ ఆఫర్లు

18 Nov, 2019 14:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌ సంస్థ వివో మిడ్‌ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో  వై19 పేరుతో  భారతీయ మార్కెట్లో సోమవారం లాంచ్‌ చేసింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రూ. 13990లకు వై 19 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రూపొందించినట్టుగా భావిస్తున్న దీన్ని మాగ్నెటిక్ బ్లాక్, స్ప్రింగ్ వైట్ కలర్ వేరియంట్‌లలో తీసుకొచ్చింది. నవంబర్ 20 నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, పేటిఎమ్,  టాటా క్లిక్‌లతో సహా  అన్ని ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.

వై 19 ఫీచర్లు
6.53 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి + హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
1080 x 2340  పిక్సెల్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
4జీబీ ర్యామ్‌, 28 జీబీ  స్టోరేజ్
16ఎంపీ + 8ఎంపీ+ 2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్పీ కెమెరా


ఏఐ ఆధారిత  ఫేస్‌ అన్‌లాక్‌ సపోర్ట్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌  18 వాట్స్‌ డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్‌,  కెమెరా, భారీ బ్యాటరీ, మెరిసే డిజైన్, అల్ట్రా-గేమ్ మోడ్‌ లాంటి అధునాతన ఫీచర్లతో తాజా స్మార్ట్‌ఫోన్‌ వై 9 ద్వారా తాము మరింత బలోపేతం చేస్తున్నామని వివో ఇండియా డైరెక్టర్ నిపున్ మారియా ఒక ప్రకటనలో తెలిపారు.  మరోవైపు యూ 20పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 22న లాంచ్‌ చేయనుంది.  అంతేకాదు భారత మార్కెట్‌లో కాలిడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులను ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తోంది.  నవంబరు 30 వతేదీవరకు క్యాప్‌బ్యాక్స్‌, ఎక్స్జంజ్‌ ఆఫర్‌  తదితర ఆఫర్లను ప్రకటించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా