అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధర ‘యూ 20’

22 Nov, 2019 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌ సంస్థ  వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను  విడుదల చేసింది. యు-సిరీస్‌లో  భాగంగా  ‘యు 20’ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం  లాంచ్‌ చేసింది. రేసింగ్ బ్లాక్, బ్లేజ్ బ్లూలో 4జీబీ/64జీబీ స్టోరేజ్‌, 6జీబీ/ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్‌,18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జర్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దేశీయంగా గ్రేటర్ నోయిడాలో యూ 20ను తయారు చేశామని వివో వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌, వివో ఇ-స్టోర్లలో నవంబర్ 28 నుండి అందుబాటులోకి రానుందని వివో ఇండియా డైరెక్టర్ నిపుణ్‌ మారియా ఒక ప్రకటనలో తెలిపారు.  

వివో యూ 20 ఫీచర్లు 
6.53 అంగుళాల ఫుల్‌హెచ్‌ఢీ స్ర్కీన్‌
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675  ప్రాససర్‌
16+8+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 

ధరలు 
4జీబీ+64జీబీ స్టోరేజ్‌ రూ.10,990  
6జీబీ+64జీబీ స్టోరేజ్‌ రూ.11,990 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా