‘క్లియర్‌ యాజ్‌ రియల్‌’ : ప్రపంచంలోనే  తొలి ఫోన్ 

21 Sep, 2019 15:58 IST|Sakshi

ప్రపంచంలోనే అద్భుత  కెమెరాల తొలి స్మార్ట్‌ఫోన్‌ 

నాలుగు రియర్‌ కెమెరాలతో వివో వీ17 ప్రో

డ్యుయల్‌ పాప్‌ అప్‌ రియర్‌ కెమెరాలు

డ్యుయల్‌  సెల్ఫీ  కెమెరా

సాక్షి, ముంబై : వివో  తన నూతన స్మార్ట్‌ఫోన్‌ వివో వీ 17 ప్రోను  శనివారం విడుదల చేసింది. ఎప్పటినుంచోటీజర్లతో భారత వినియోగదారులను ఊరిస్తున్న కంపెనీ  ఎట్టకేలకు వివో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. రెండు సెల్పీ కెమెరాలతో పాటు, డ్యుయల్ పాప్-అప్ రియర్‌ కెమెరా, మరోరెండు కెమెరా సెటప్‌తో దీన్ని ఆవిష్కరించడం విశేషం. అంటే నాలుగు రియర్‌ కెమెరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చింది.  ఈ తరహా ఫీచర్లతో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది.  వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌  ధరను ఇండియాలో రూ. 29,990గా నిర్ణయించింది.


 
వివో  వీ17 ప్రొ
6.59 సూపర్‌ అమోలెడ్‌  డిస్‌ప్లే
2400x1080 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
 క్వాల్కం స్నాప్‌బ్రాగన్ 675 సాక్‌
8 జీబీ  ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
48+13 ఎంపీ పాప్‌ అప్‌ కెమెరా, 8+2 ఎంపీ రియర్‌ కెమెరా
32+8 ఎంపీ సెల్పీ కెమెరా
4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రెండు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ ఆర్డర్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉండగా, సెప్టెంబరు 27 నుంచి కొనుగోలుకు లభ్యం. 


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా