కొత్త టెక్నాలజీతో వివో తొలి స్మార్ట్‌ఫోన్‌

11 May, 2018 17:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనీస్ స్మార్ట్‌ఫోన్‌  తయారీ  సంస్థ వివో  మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.   ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో   ఈ డివైస్‌ను లాంచ్‌ చేస్తోంది.   ఎక్స్‌21 యూడి పేరుతో మే 29న  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించనుంది.   ఈ మేరకు లాంచింగ్‌ ఆహ్వానాలను వివో పంపించింది. దీని  ధరను రూ .40,000గా నిర్ణయించే అవకాశం ఉందని  పరిశ్రమ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌  స్కానింగ్‌ టెక్నాలజీతో లాంచ్‌ కానున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదేనని  తెలిపాయి.    చైనా సహా ఇతర  అంతర్జాతీయ మార్కట్లోల ఈ ఫోన్‌ రెండు వెర్షన్‌లలో ఎక్స్‌ 21, ఎక్స్‌ 21 ప్లస్‌ యూడీ డివైస్‌లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది.  ఇండియన్‌ మార్కెట్‌లో ఏ పేరుతో విడుదల చేయనుందీ స్పష్టత లేదు.

ఎక్స్‌21 యూడి  ఫీచర్లు
6.2 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌  స్క్రీన్‌
1080 x 2280 రిజల్యూషన్ (19: 9
క్వాల్కమ్  స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్‌ )
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
6జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌
256 దాకా  విస్తరించుకునే సదుపాయం
12+5ఎంపీ రియర్‌ కెమెరా
12ఎంపీ  సెల్ఫ  కెమెరా
3200 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ ప్రింట్‌ స్కానింగ్ టెక్నాలజీ అభివృద్ధిలో  తాము  మార్గదర్శిగా ఉన్నామని  వివో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ ఫెంగ్ చెప్పారు.  ఆప్టికల్  ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్తో వినియోగదారులకి ఈ ఫ్యూచరిస్టిక్ మొబైల్ అనుభవాన్ని అందించడంలో అడుగు ముందుకు  వేశామనీ, చాలా త్వరగా వినియోగదారులకు అందుబాటులోకి రావటానికి చాలా సంతోషిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు