వివో వై71 స్మార్ట్‌ఫోన్‌..బిగ్‌ స్క్రీన్‌, బడ్జెట్‌ ధర

14 Apr, 2018 08:31 IST|Sakshi
వివో స్మార్ట్‌ఫోన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి,న్యూఢిల్లీ: చైనా  మొబైల్‌ తయారీదారు ​వివో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో ‘వివో వై 71’  పేరుతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మాట్ట్ బ్లాక్ అండ్‌ గోల్డ్‌ కలర్స్‌లో  విడుదలైన ఈ డివైస్‌ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది.   ఏప్రిల్‌ 14 నుంచి అన్ని ఆఫ్‌లైన్‌ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తామని వివో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  అలాగే వివో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎంమాల్ ద్వారా  ఏప్రిల్‌ 16 నుంచి అందుబాటులో ఉంటాయని  వెల్లడించింది.  భారీ డిస్‌ప్లే,  మెరుగైన పనితీరు, హై డెఫినిషన్ కెమెరా సామర్థ్యాలతో తమ తాజా స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించామని  వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగ్‌ తెలిపారు. 

 వై 71 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
6 అంగుళాలఫుల్‌వ్యూ డిస్‌ప్లే  84.4 శాతం స్క్రీన్ బాడీరేషియో
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ 
256 జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
13ఎంపీ  హై డెఫినిషన్ వెనుక కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3360 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు